Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS మ్యాచ్ డ్రా.. శతక్కొట్టిన పడిక్కల్, ధ్రువ్ జురెల్!

సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఏతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌ను భారత్-ఏ డ్రా చేసుకుంది. లక్నో వేదికగా శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత-ఏ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేశారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్-ఏ 98 ఓవర్లలో 532/6 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. సామ్ కొన్‌స్టాస్(109), జోష్ ఫిలిప్పే(123 నాటౌట్) శతకాలతో రాణించగా.. కాంప్‌బెట్ కెల్లవూ(88), లియామ్ స్కాట్(81), కూపర్ కొన్నొల్లీ(70) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే మూడు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది.

India A vs Australia A 1st Unofficial Test Ends in a Draw as Padikkal and Jurel Score Centuries

అనంతరం భారత్-ఏ తొలి 141.1 ఓవర్లలో 531/7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. దేవదత్ పడిక్కల్(150), ధ్రువ్ జురెల్(140) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నారయణ జగదీశన్(73), సాయి సుదర్శన్(73) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8) తీవ్రంగా నిరాశపర్చాడు.

ఆసీస్ బౌలర్లలో కోరే మూడు వికెట్లు తీయగా.. ఓ నీల్, గ్జేవియర్, లియామ్ స్కాట్, కూపర్ కొన్నొల్లీ తలో వికెట్ తీసారు. అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల అంపైర్లు డ్రాకు అంగీకరించారు.

సెప్టెంబర్ 23 నుంచి లక్నో వేదికగానే ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్‌ బరిలోకి దిగనున్నారు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌‌కు ఈ మ్యాచ్‌తో రిథమ్ అందుకోనున్నారు. ఈ రెండు అనధికారిక టెస్ట్ సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లకు వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌లో చోటు దక్కనుంది.

Story first published: Friday, September 19, 2025, 17:01 [IST]
Other articles published on Sep 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+