Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్‌గా రజత్ పాటిదార్! రైజింగ్ స్టార్స్ ఆసియా‌కప్ ఆడే భారత జట్టు ఇదే!

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీ బరిలోకి దిగే భారత్-ఏ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు వివరాలను ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలోని భారత పురుషుల సెలెక్షన్ కమిటీ సోమవారం వెల్లడించింది. తిలక్ వర్మ‌‌ను సారథిగా ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ.. ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

టీమిండియా టీనేజ్‌ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా ఈ జట్టులో అవకాశం అందుకున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఈ జోడీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 43 బంతుల్లోనే 133 పరుగులతో రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. వికెట్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రాన్‌ను ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ అతనికి బ్యాకప్‌గా జార్ఖండ్ సెన్సేషన్ కుమార్ కుశాగ్రకు అవకాశం కల్పించింది.

India A Squad Announced for ACC Rising Stars Asia Cup 2026 Tilak Varma to Captain Patidar Named Deputy

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా సిద్దం చేస్తున్న యువ పేస్ ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేకు ఈ జట్టులోనూ చోటు దక్కింది. షెహ్‌బాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా చోటు దక్కించుకోగా.. హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్‌లను పేసర్లుగా ఎంపికయ్యారు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గాయంతో భారత జట్టుకు దూరమైన హర్షిత్ రాణా.. ఈ టోర్నీతోనే పునరాగమనం చేయనున్నాడు.

వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీని ఈ సారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడించనున్నారు. నవంబర్ 19 నుంచి 29 వరకు దోహా వేదికగా ఈ టోర్నీ జరగనుండగా.. పాకిస్థాన్, యూఏఈ, నేపాల్‌తో భారత్ గ్రూప్-ఏలో ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న నేపాల్‌తో ఆడనుంది. నవంబర్ 22న పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్, నవంబర్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి భారత్-ఏ జట్టు: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(కెప్టెన్), తిలక్ వర్మ(కెప్టెన్), రజత్ పాటిదార్(కెప్టెన్), రింకూ సింగ్, కుమార్ కుశాగ్ర(కీపర్), సూర్యాన్ష్ షెడ్గే, షెహ్‌బాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనూష్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.

Story first published: Monday, November 2, 2026, 19:03 [IST]
Other articles published on Nov 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+