Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ‌పై ఐసీసీ చర్యలు..?

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఏతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు.

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం బయటకు వెళ్లే సమయంలో వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు ఏదో అనగా.. అతను వారిపైకి దూసుకెళ్లాడు. ఓ ఆటగాడిని తన చేతులతో నెట్టేసాడు. అంపైర్లు, శ్రీలంక వికెట్ కీపర్ జోక్యం చేసుకొని ఇద్దర్ని విడదీసారు.

India A s Vaibhav Sooryavanshi Faces Potential Penalty After Heated Post-Match Shove Against Sri Lanka A
Photo Credit: X (twitter)

అంతకుముందు ఒక నోబాల్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదం చేస్తున్నప్పుడు.. సూర్యవంశీ కూడా జోక్యం చేసుకున్నాడు. అంపైర్లతో వాదనకు దిగాడు. ఆ తర్వాత కోచ్ హృషికేష్ కనిత్కర్ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు.

IND vs SL: అంపైర్‌తో కెప్టెన్ గొడవ.. మధ్యలో దూరి వైభవ్ ఏం చేశాడో చూస్తే షాకవుతారు!

IND vs SL: అంపైర్‌తో కెప్టెన్ గొడవ.. మధ్యలో దూరి వైభవ్ ఏం చేశాడో చూస్తే షాకవుతారు!

మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లతో వాగ్వాదానికి దిగడం ఫిజికల్‌గా ఘర్షణకు దిగితే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 ఉల్లంఘన కిందికి వస్తుంది. వైభవ్ సూర్యవంశీ‌ది తప్పేనని మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తే మ్యాచు ఫీజులో 50 శాతం ఫైన్ విధించవచ్చు. ఈ ఘటనను మరింత సీరియస్‌గా గుర్తిస్తే 1 లేదా 2 డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. లేదంటే మందలింపుతో సరిపెడతారు.

త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన వైభవ్ సూర్యవంశీకి ఈ ఘటన పెద్ద మచ్చగా మారనుంది. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఇలా సహనం కోల్పోయి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అనవసర విషయాలను పక్కనపెట్టి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యన్ష్ షెడ్గే(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72), విప్రజ్ నిగమ్(49 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(21), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(11), రుతురాజ్ గైక్వాడ్(37), తిలక్ వర్మ(23), ఆయుష్ బదోని(15), నిషాంత్ సింధు(6) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్(3/33), విజయ్‌కాంత్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. సహాన్, వనుజ సహన్, మతులన్ తలో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులే చేసింది. సదీర సమరవిక్రమా(113 బంతుల్లో 7 ఫోర్లతో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. నిరోషన్ డిక్‌వెల్లా(37), వానుజ సాహన్(25) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, సూర్యాన్ష్ షెడ్గే తలో వికెట్ తీసారు.

IND vs SL: కొంపముంచిన బుడ్డోడు.. సూపర్ ఓవర్‌లో ఒక్క సిక్సర్ కొట్టని వైభవ్ సూర్యవంశీ!

IND vs SL: కొంపముంచిన బుడ్డోడు.. సూపర్ ఓవర్‌లో ఒక్క సిక్సర్ కొట్టని వైభవ్ సూర్యవంశీ!
Story first published: Tuesday, June 16, 2026, 11:02 [IST]
Other articles published on Jun 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+