Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: జడేజాకు షాక్..ఇద్దరు తెలుగోళ్లకు చోటు!సంజ‌య్ మంజ్రేక‌ర్‌ తుది జట్టు ఇదే!

India 11 For WTC Final: Sanjay Manjrekar Misses Out Ravindra Jadeja
WTC Final : Jadeja Out, Vihari In - Manjrekar's IND Playing XI || Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కౌంట్ డౌన్‌ మొదలైంది. మరో 3 రోజుల్లో ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్‌ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

క్రికెట్ చరిత్రలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట‌ర్, వివాస్పద కామెంటేటర్ సంజ‌య్ మంజ్రేక‌ర్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఓ జట్టును ఎంచుకున్నాడు.

జడేజాకు షాక్

జడేజాకు షాక్

సంజ‌య్ మంజ్రేక‌ర్‌ ప్రకటించిన జట్టులో దాదాపు అందరూ ఊహించినవారే ఉండగా.. ఇద్దరికి మాత్రం చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చోటు లేకపోవడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను మాత్రమే మంజ్రేక‌ర్‌ ఎన్నుకున్నాడు.

ఇంగ్లండ్‌లోని పరిస్థితుల దృష్ట్యా ఒకే స్పిన్నర్ అవసరం ఉంటుందని, అందుకే సీనియర్ అయిన అశ్విన్‌ను తీసుకుకున్నానని చెప్పాడు. మంజ్రేక‌ర్‌, జడేజాకు గతకొద్ది రోజులుగా పడట్లేదన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో ఒకే సమయంలో ఎండ కాస్తుందని మరియు అదే సమయంలో ఆకాశం మేఘావృతమవుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా జట్టును ఎంచుకున్నానని ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మంజ్రేక‌ర్‌ చెప్పాడు.

విహరి అందుకే తీసుకున్నా

విహరి అందుకే తీసుకున్నా

ఓపెనర్లుగా శుబ్‌మాన్‌ గిల్ మరియు రోహిత్ శర్మలను సంజ‌య్ మంజ్రేక‌ర్‌ ఎన్నుకున్నాడు. మయాంక్ అగర్వాల్‌ను మంజ్రేకర్ పట్టించుకోలేదు. చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ మరియు అజింక్య రహానెలకు వరుసగా అవకాశం ఇచ్చాడు. హనుమ విహారి రూపంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ని టీమ్‌లోకి తీసుకున్న మంజ్రేకర్.. ఏడవ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకున్నాడు. స్వింగ్ మరియు సీమ్ పరిస్థితులలో విహారి బాగా ఆడగలడని చెప్పాడు. ప్రాక్టీస్ మ్యాచులు లేనందున బ్యాటింగ్ బలోపేతం కోసం కూడా విహరికి ఓటేశానని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

WTC Final:టీమిండియాతో తలపడే కివీస్‌ జట్టు ఇదే.. కేన్‌ ఆగయా! ఒక స్పిన్నర్‌కి మాత్రమే చోటు!

ఇషాంత్‌పై వేటు

ఇషాంత్‌పై వేటు

ఆల్‌రౌండర్ కోటాలో సంజ‌య్ మంజ్రేక‌ర్‌ ఎవరినీ జట్టులోకి తీసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. అలానే పేస్ ఆల్‌రౌండర్‌ శార్ధూల్ ఠాకూర్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ పరిగణిస్తోంది.

కానీ అతడికి కూడా మంజ్రేకర్ చోటివ్వలేదు. ముగ్గురు పేసర్లకి (మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) టీమ్‌లో ఛాన్స్ ఇచ్చిన మంజ్రేకర్.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మపై వేటు వేశాడు. భారత్ ఇషాంత్‌ను తీసుకోవచ్చు కానీ నా ఓటు సిరాజ్కే అని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో సిరాజ్ బాగా బౌలింగ్ చేశాడని, అలాంటి వారిని పక్కనపెట్టలేం అన్నాడు. మొత్తానికి సంజయ్ తన జట్టులో ఇద్దరు తెలుగోళ్లకు చోటిచ్చాడు.

సంజయ్ మంజ్రేకర్ జట్టు ఇదే

సంజయ్ మంజ్రేకర్ జట్టు ఇదే

శుభమన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, June 15, 2021, 15:53 [IST]
Other articles published on Jun 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+