Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final:టీమిండియాతో తలపడే కివీస్‌ జట్టు ఇదే.. కేన్‌ ఆగయా! ఒక స్పిన్నర్‌కి మాత్రమే చోటు!

New Zealand Name 15-Man Squad for WTC Final 2021, Kane Williamson returned to lead the NZ

లండన్: టీమిండియాతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్‌లో తలపడే న్యూజిలాండ్‌ జట్టును కివీస్ బోర్డు మంగళవారం ప్రకటించింది. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన జట్టును కివీస్‌ ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతడు మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీపర్​ బీజే వాట్లింగ్ కూడా అందుబాటులోకి వచ్చాడు.

ఇంగ్లండ్‌తో గత ఆదివారం ముగిసిన రెండో టెస్టుకి గాయాల కారణంగా కేన్‌ విలియమ్సన్‌, బీజే వాట్లింగ్ దూరమైన విషయం తెలిసిందే. విలియమ్సన్‌కి మోచేతి గాయం‌ కాగా.. వాట్లింగ్‌ వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అయితే కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సమయానికి ఈ ఇద్దరూ ఫిట్‌నెస్ సాధిస్తారని న్యూజిలాండ్ టీమ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధీమా వ్యక్తం చేశాడు. కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌ను స్పెషలిస్ట్‌ ఆల్‌రౌండర్‌గా.. అజాజ్‌ పటేల్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఎంపికచేశారు. సౌథాంప్టన్ పిచ్ పేస్‌కి అనుకూలించనుండడంతో .. అజాజ్ పటేల్ రూపంలో కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌కి టీమ్‌లో కివీస్ చోటిచ్చింది. ఇక బ్యాకప్ కీపర్‌గా టామ్ బ్లండెల్ ఎంపికయ్యాడు.

ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడిన టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్ మరియు డెవాన్ కాన్వే తమ స్థానాలను నిలబెట్టుకోగా.. మిచెల్ సాంట్నర్ మరియు డారిల్ మిచెల్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక కాలేదు. ట్రెంట్ బౌల్ట్, టిమ్‌ సౌథీ, మాట్ హెన్రీ మరియు కైల్ జేమిన్సన్‌లతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. సౌథాంప్టన్​ వేదికగా టీమిండియాతో తలపడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని న్యూజిలాండ్‌ హెడ్ కోచ్‌ గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు. ​

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కివీస్‌ జట్టు:
కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డేవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మాట్ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌.

Story first published: Tuesday, June 15, 2021, 14:58 [IST]
Other articles published on Jun 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+