Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND W vs SA W: హాఫ్ సెంచరీలతో చెలరేగిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం!

IND-W vs SA-W: Laura Wolvaardt 50, Goodall Keep India At Bay After Early Loss

క్రైస్ట్‌చర్చ్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సమష్టిగా రాణించారు. సౌతాఫ్రికాతో జరుగుతోన్న చివరి లీగ్‌ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలుత ఓపెనర్లు స్మృతి మంధాన (84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), షెఫాలీ వర్మ (46 బంతుల్లో 8 ఫోర్లతో 53) అర్ధ శతకాలతో శుభారంభం చేయగా తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (84 బంతుల్లో 8 ఫోర్లతో 68), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ( 57 బంతుల్లో 4 ఫోర్లతో 48)కీలక పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మసాబటా క్లాస్‌, షబ్నిమ్‌ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు తీయగా.. క్లో ట్రియన్‌, అయాబొంగా ఖాకా తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించారు. తొలి వికెట్‌కు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ 91 పరుగులు జోడించారు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత షెఫాలీ వర్మ రనౌటైంది. కాసేపటికే వన్‌డౌన్‌ బ్యాటర్‌ యాస్తిక భాటియా (2) కూడా నిరాశపరిచింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మిథాలీ.. స్మృతితో కలిసి నిలకడగా ఆడింది. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే, భారత్‌ స్కోర్‌ 176 పరుగుల వద్ద స్మృతి సూపర్ క్యాచ్‌కు మూడో వికెట్‌గా వెనుదిరగ్గా స్కోర్‌ నెమ్మదించింది. అయినా, మిథాలీ రాజ్ అర్ధ శతకంతో రాణించింది. కానీ స్వల్ప వ్యవధిలో మిథాలీ, పూజా వస్త్రాకర్‌(3) ఔటయ్యారు. ఆపై హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, రీచా ఘోష్‌(8) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, సౌతాఫ్రికా బౌలర్లు చివర్లో చెలరేగడంతో భారత్‌ 274/7కే పరిమితమైంది.

అనంతరం లక్ష్యచేదనకు దిగిన సౌతాఫ్రికా ధీటుగా ఆడుతోంది. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్ లిజెల్లే లీ(6) విఫలమైనా.. లౌరా(73 బ్యాటింగ్), లారా గుడాల్(43 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు. 23 ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోయారు. లిజేల్లే లీ కూడా రనౌట్‌గా వెనుదిరిగింది. సౌతాఫ్రాకి విజయానికి 146 పరుగులు అవసరం.

Story first published: Sunday, March 27, 2022, 12:12 [IST]
Other articles published on Mar 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+