IND W vs SA W: నోబాల్‌తో కొంపముంచిన దీప్తి శర్మ.. ప్రపంచకప్ నుంచి మిథాలీసేన ఔట్!

క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు మరోసారి కలిసి రాలేదు. విశ్వవిజేతగా నిలవాలన్న కల కలగానే మిగిలిపోయింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో మిథాలీ సేన మూల్యం చెల్లించుకుంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను ఘోర తప్పిదంతో చేజార్చుకొని ఉత్తి చేతులతోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
బ్యాటర్లు చెలరేగినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), షెఫాలీ వర్మ (46 బంతుల్లో 8 ఫోర్లతో 53) అర్ధ శతకాలతో శుభారంభం చేయగా తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కెప్టెన్ మిథాలీ రాజ్ (84 బంతుల్లో 8 ఫోర్లతో 68), హర్మన్ ప్రీత్ కౌర్ ( 57 బంతుల్లో 4 ఫోర్లతో 48) కీలక పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మసాబటా క్లాస్, షబ్నిమ్ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు తీయగా.. క్లో ట్రియన్, అయాబొంగా ఖాకా తలో వికెట్ పడగొట్టారు.
తేలిపోయిన బౌలర్లు..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ లౌరా(79 బంతుల్లో 11 ఫోర్లతో 80),మిగ్నో డూప్రీజ్(63 బంతుల్లో 2 ఫోర్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. హర్మన్ ప్రీత్ కౌర్ రెండు వికెట్లు తీసింది. ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు.
చివరి ఓవర్‌లో డ్రామా..
ఇక చివరి ఓవర్‌లో డ్రామా చోటు చేసుకుంది. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా భారత కెప్టెన్ మిథాలీ రాజ్.. దీప్తి శర్మకు బంతిని అందించింది. తొలి బంతికి సింగిల్ ఇచ్చిన దీప్తి.. రెండో బంతికి సింగిల్ ఇవ్వడంతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్ త్రిషా శెట్టిని రనౌట్ చేసింది. ఆ తర్వాత రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇవ్వడంతో చివరి రెండు బంతులకు సౌతాఫ్రికా విజయానికి 3 పరగులు అవసరమయ్యాయి. ఇక 5వ బంతికి క్రీజులో కుదురుకున్న బ్యాటర్ డూప్రీజ్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అందుకుంది.

క్షమించరాని నేరం..
దాంతో భారత ఆటగాళ్లంతా సంబరాల్లోమునిగి తేలారు. భారత్ విజయం లాంఛనమని అంతా భావించారు. కానీ అక్కడే అంపైర్ పెద్ద ట్విస్ట్ ఇస్తూ నోబాల్‌గా ప్రకటించింది. దాంతో భారత అమ్మాయి ఆనందం ఆవిరి అయ్యింది. కీలక సమయంలో దీప్తి శర్మ క్షమించరాని నేరం చేసి భారత ఓటమికి కారణమైంది. దాంతో చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరమవ్వగా.. సౌతాఫ్రికా బ్యాటర్లు 5 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications