న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND-W vs NZ-W: చెలరేగిన సాటర్త్‌వైట్, అమెలి కెర్.. భారత అమ్మాయిల ముందు టఫ్ టార్గెట్!

IND-W vs NZ-W: Pooja Vastrakar Takes Four as India Keep New Zealand to 260/9

హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత్ ముందు 261 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. న్యూజిలాండ్ బ్యాటర్స్ సాటర్త్‌వైట్(84 బంతుల్లో 9 ఫోర్లతో 75), అమెలి కెర్(64 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు చేసింది.

స్టార్ ఓపెనర్ సుజీ బెట్స్(5) విఫలమైన కెప్టెన్ సోఫి డివైన్(30 బంతుల్లో 7 ఫోర్లతో 35), వికెట్ కీపర్ బ్యాటర్ కాటే మార్టిన్(51 బంతుల్లో 3 ఫోర్లతో 41) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ (4/34) నాలుగు వికెట్లతో సత్తా చాటగా రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టింది. జులాన్ గోస్వామి, దీప్తి శర్మలకు చెరొక వికెట్ దక్కింది.

పుజా సూపర్ బౌలింగ్..

టాస్ ఓడి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మహిళలకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ సుజీ బెట్స్ సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగింది. పుజా వస్త్రాకర్ సూపర్ ఫీల్డింగ్‌కు సుజీ బెట్స్ నిరాశగా పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమెలి కెర్‌తో కలిసి కెప్టెన్ డివైన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఇక క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని పుజా వస్త్రాకర్ విడదీసింది. కెప్టెన్ డివైన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చెలరేగిన సాటర్త్‌వైట్

ఆ తర్వాత సాటర్త్‌వైట్‌తో జత కలిసిన అమెలి కెర్ ధాటిగా ఆడింది. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. మరోవైపు సాటర్త్‌వైట్ కూడా బౌండరీలతో చెలరేగింది. దాంతో భారత బౌలర్లు తేలిపోయారు. మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం ఈ జోడీని గైక్వాడ్ విడదీసింది. సూపర్ బాల్‌తో అమెలి కెర్‌ను ఎల్బీగా బోల్తా కొట్టించింది. అమెలి ఔటైనా.. సాటర్త్‌వైట్ జోరు ఆగలేదు. మ్యాడీ గ్రీన్(27)తో కలిసి బౌండరీలు బాదింది. గ్రీన్‌ను దీప్తి శర్మ పెవిలియన్ చేర్చినా.. కాటే మార్టిన్‌తో కలిసి భారీ స్కోర్‌కు బాటలు వేసింది.

ఔటవ్వడంతో..

సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సాటర్త్‌వైట్‌ను పుజా వస్త్రాకర్ సూపర్ డెలివరీతో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో న్యూజిలాండ్ భారీ స్కోర్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోయరార్డర్ బ్యాటర్స్, టెయిలండర్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరో ఎండ్‌లో కాటే మార్టిన్‌ పరుగులు చేసే ప్రయత్నం చేసినా.. ఆమెకు సహకారం లభించలేదు. చివరకు ఆమెను గోస్వామి ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 260 పరుగుల వద్ద ఆగిపోయింది.

Story first published: Thursday, March 10, 2022, 10:34 [IST]
Other articles published on Mar 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X