IND-W vs NZ-W: ప్చ్.. వన్డే సిరీస్ కూడా గోవింద! తెలుగు అమ్మాయి మెరిసినా మిథాలీసేనకు తప్పని ఓటమి!

క్వీన్స్‌టౌన్: న్యూజిలాండ్ గడ్డపై భారత మహిళల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత మహిళల జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడు వన్డేల్లో పరాజయం పాలైంది. దాంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కోల్పోయింది.
క్వీన్స్‌టౌన్ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన.. నిర్ణీత 49.3 ఓవర్లలో 279 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టులో తెలుగు తేజం, ఓపెనర్ సబ్బినేని మేఘన(41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(57 బంతుల్లో 7 ఫోర్లతో 51), దీప్తి శర్మ(69 బంతుల్లో 7 ఫోర్లతు, సిక్స్‌తో 69 నాటౌట్)లు అర్థ శతకాలతో రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో హన్నా రోవ్, మైర్, రెండేసి వికెట్లు తీయగా.. సోపీ డివైన్, అమెలియా కెర్, ఫ్రాన్సెస్ మాకే, సాటర్ వైట్ తలో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్యం విధంచడంతో విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ.. రికార్డు స్థాయిలో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ మహిళల జట్టు ఛేదించేసింది. 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 280 పరుగులు చేసింది. అమెలియా కెర్(67), సాటర్ వైట్(59), లారెన్ డౌన్(64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి మూడు వికెట్లు తీయగా.. రేణుక సింగ్, ఎక్తా బిష్త్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మంగళవారం(ఫిబ్రవరి 22) జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications