Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND-W vs ENG-W: నేషనల్ క్రష్ స్మృతి మంధాన అరుదైన ఘనత! తొలి మహిళా బ్యాటర్‌గా..

IND-W vs ENG-W: Twitter reacts after Smriti Mandhana scores fastest fifty

బర్మింగ్‌హామ్: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, నేషనల్ క్రష్ స్మృతి మంధాన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ బాదిన మంధాన(32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఈ క్రికెట్ బ్యూటీ.. 23 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంది.

తొలి బ్యాటర్‌గా..

ఓవరాల్ టీ20 క్రికెట్‌లో నాకౌట్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా మంధాన చరిత్రకెక్కింది. మహిళా క్రికెట్‌లో నాకౌట్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్‌ మెగ్‌లాన్నింగ్‌ (27 బంతుల్లో) పేరిట ఉండేది. మంధాన తాజా ప్రదర్శనతో ఆ రికార్డు బద్ధలైంది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక సిక్స్‌లు, బౌండరీలు బాదిన బ్యాటర్ మంధానానే కావడం విషేషం. లీడ్ స్కోరర్‌ కూడా ఈ క్రికెట్ బ్యూటీనే. ఈ మ్యాచ్‌కు ముందు 24 బంతుల్లో, 25 బంతుల్లో మంధాన రెండు సార్లు వేగవంతమైన హాఫ్ సెంచరీలు బాదింది. తాజా ప్రదర్శనతో తన రికార్డును మెరుగుపరుచుకుంది.

కళాత్మక కవర్ డ్రైవ్స్‌తో..

ఈ సెమీస్ పోరులో మంధాన తన కళాత్మక షాట్లతో అలరించింది. కవర్ డ్రైవ్, ఫ్లిక్, కట్ షాట్స్‌తో పాటు స్క్వేర్ డ్రైవ్, పుల్ అడ్ హుక్ షాట్, స్వీప్, రివర్స్ స్వీప్‌లతో బౌండరీలు బాది క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు మంధాన బ్యాటింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియా వేదికగా మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆమె ఆటతో అందానికి కోట్లలో ఉన్న అభిమానులు.. ఈ ఇన్నింగ్స్‌తో తమ గుండెలు గాల్లో తేలుతున్నాయని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

భారత్ 164/5

ఈ మ్యాచ్‌లో మంధాన విధ్వంసం ధాటికి పటిష్టమైన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళం తేలిపోయింది. మంధానకు తోడుగా జెమీమా రోడ్రిగ్స్(31 బంతుల్లో 7 ఫోర్లతో 44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ ముందు భారత్ 165 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ (2/22) రెండు వికెట్లు తీయగా.. నాట్ సివర్(1/26), కాథరిన్ బ్రంట్ (1/30) చెరొక వికెట్ పడగొట్టారు.

Story first published: Saturday, August 6, 2022, 18:27 [IST]
Other articles published on Aug 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+