Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND W vs ENG W: ఇంగ్లండ్‌దే బ్యాటింగ్.. బరిలో తెలుగు అమ్మాయి!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ మహిళల జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ తెలిపింది. వన్డే ప్రపంచకప్ ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా వాడుకుంటామని పేర్కొంది.

'జట్టుగా మేం వన్డే ప్రపంచకప్ కోసం సన్నదమవుతున్నాం. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లా కనిపిస్తోంది. భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం.'అని నాట్ సివర్ బ్రంట్ చెప్పుకొచ్చింది.

మరోవైపు టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. 'మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. కానీ టాస్ మా నియంత్రణలో లేదు. టీ20 సిరీస్ మాకు అనుకూలంగా సాగింది. వచ్చే ఏడాది ఇక్కడే జరిగే టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ సిరీస్‌ మాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో మేం ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. తెలుగు అమ్మాయి శ్రీ చరణికి తుది జట్టులో అవకాశం దక్కింది.

IND W vs ENG W England Women Opt To Bat First In 1st ODI vs India
Photo Credit: BCCI

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2తో గెలుచుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.

తుది జట్లు:

ఇంగ్లండ్:

టామ్మీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఎమ్మా ల్యాంబ్, నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫిలర్, లారెన్ బెల్

భారత్

ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.

Story first published: Wednesday, July 16, 2025, 17:58 [IST]
Other articles published on Jul 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+