Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDW vs ENGW: భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం!

INDW vs ENGW: ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ముంబై వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ మహిళల జట్టు 38 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేనియల్ వ్యాట్(47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75), నాట్ సీవర్(53 బంతుల్లో 13 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్(3/27) అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీయగా.. సైకా ఇషాక్ ఓ వికెట్ పడగొట్టింది.

IND-W vs ENG-W 1st T20I: England Womens Beat India Womens by 38 runs

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(42 బంతుల్లో 9 ఫోర్లతో 52) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సోఫీ ఎకెలెస్టోన్ మూడ వికెట్లు తీయగా.. సారా గ్లేన్, ప్రెయా కెంప్, నాట్ సీవర్ తలో వికెట్ తీసారు.

198 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే స్మృతి మంధాన(6)ను నాట్ సీవర్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ వెంటనే జెమీమా రోడ్రీగ్స్(4)ను కెంప్ కీప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి షెఫాలీ వర్మ చెలరేగింది. ఈ ఇద్దరూ కాస్త ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన ఈ జోడీని ఎకెల్‌స్టోన్ విడదీసింది.

IND-W vs ENG-W 1st T20I: England Womens Beat India Womens by 38 runs

హర్మన్‌ప్రీత్(26)ను క్లీన్ బౌల్డ్ చేసింది. రిచా ఘోష్ సాయంతో షెఫాలీ వర్మ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ధాటిగా ఆడే క్రమంలో రిఛా ఘోష్(21)తో పాటు షెఫాలీ వర్మ(52) ఔటైంది. షెఫాలీ వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది.

Story first published: Wednesday, December 6, 2023, 22:17 [IST]
Other articles published on Dec 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+