Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: బుడ్డోడి విధ్వంసం.. టీమిండియా ఘన విజయం! మలుపు తిప్పిన పేస్ సెన్సేషన్!

జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో టీ20ల్లో తమ పరాజయాల పరంపరకు టీమిండియా బ్రేక్ వేసింది. వరుసగా 6 పరాజయాల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది.

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు!

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. వెస్లీ మధెవెరే(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39), తడివానషే మరుమాని(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(2/18), ప్రిన్స్ యాదవ్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

IND vs ZIM Vaibhav Sooryavanshi and Mayank Yadav Star as India Defeat Zimbabwe in 1st T20I

అనంతరం భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 3 ఫోర్లతో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ రెండు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా ఒక వికెట్ పడగొట్టాడు.

అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్

అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..

స్వల్ప లక్ష్యఛేదనలో అభిషేక్ శర్మ(1) విఫలమైనా.. వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్‌లో భారీ సిక్స్‌లు బాదాడు. 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

హాఫ్ సెంచరీ ముగిసిన వెంటనే వైభవ్ ఔటైనా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపించాడు. విజయం ముంగిట ఇషాన్ కిషన్ ఔటవ్వగా.. తిలక్ వర్మ(6 నాటౌట్) సాయంతో శ్రేయస్ అయ్యర్ విజయాలాంఛనాన్ని పూర్తి చేసి కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేశాడు.

మలుపు తిప్పిన మయాంక్ యాదవ్

మయాంక్ యాదవ్ సెన్సేషన్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. అతను పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మయాంక్ యాదవ్.. తన మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీసాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మయాంక్ యాదవ్ బంతులు సందించడంతో జింబాబ్వే బ్యాటర్లు తీవ్రంగా తడబడి డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. అతని అద్భుతమైన స్పెల్ మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హరారే వేదికగానే శనివారం జరగనుంది.

Story first published: Thursday, July 23, 2026, 20:11 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+