Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: వారి వల్లే ఈ విజయం: సికిందర్ రాజా

ప్రేక్షకులు ఉత్సాహపరచడంతోనే విశ్వవిజేత అయిన టీమిండియాపై విజయం సాధించామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగులు తేడాతో టీమిండియాను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) సత్తా చాటారు.

IND vs ZIM Sikander Raza credits to Zimbabwe after defeated India by 13 runs in 1st T20I

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియా అనూహ్యంగా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 27 ) మినహా అంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా(3/25), టెండాయ్ చతరా(3/16) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సికిందర్ రాజా.. ఈ గెలుపుతో తాము పొంగి పోవడం లేదన్నాడు. విశ్వ విజేత అయిన టీమిండియా ఎలా పుంజుకుంటుందో తమకు తెలుసన్నాడు.

'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ విజయంతోనే మా పని పూర్తి కాలేదు. సిరీస్ ముగియలేదు. విశ్వవిజేత ఎప్పుడూ ఛాంపియన్‌లానే ఆడుతోంది. కాబట్టి మేం తదుపరి మ్యాచ్‌కు సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది 115 పరుగులే చేయాల్సిన వికెట్ ఏ మాత్రం కాదు. ఈ క్రెడిట్ ఇరు జట్ల బౌలర్లది.

ఈ మ్యాచ్‌తో మా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందనేది స్పష్టమైంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో మా ఆటగాళ్లకు ఒక్కటే చెప్పాను. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తే ఫలితాన్ని కూడా పట్టించుకోనని తెలిపాను. మేం ఈ ప్రణాళిక కట్టుబడి ఆడాం. మా కుర్రాళ్లకు అండగా నిలిచాం.

మా ఫీల్డింగ్, క్యాచ్‌లు పట్టిన విధానం అద్భుతం. కానీ మేం కొన్ని తప్పిదాలు చేశాం. డ్రెస్సింగ్ రూమ్‌లో వాటి గురించి చర్చించుకొని మెరుగుపరుచుకుంటాం. మా అభిమానులు మమ్మల్ని ఉత్సాహపరుస్తారని తెలుసు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే.'అని సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, July 6, 2024, 21:40 [IST]
Other articles published on Jul 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+