Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: ఆ ఇద్దరి వల్లే ఓడాం: సికందర్ రాజా

టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అసాధారణ బ్యాటింగ్‌తోనే ఓటమిపాలయ్యామని జింబాబ్వే సారథి సికందర్ రాజా అన్నాడు. శనివారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. సికందర్ రాజా(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), తడివాన్షే మరుమణి(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

IND vs ZIM Sikandar Raza says heavy roller in the innings break did the trick for Team India

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 నాటౌట్), శుభ్‌మన్ గిల్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సికందర్ రాజా.. పిచ్ పూర్తిగా మారిపోవడం టీమిండియాకు కలిసొచ్చిందన్నాడు. 'పిచ్ కొంచెం తడిగా ఉండటంతో 160 పరుగుల లక్ష్యం గొప్ప అనుకున్నాం. కానీ భారత బ్యాటర్లు ఆడిన తీరు చూస్తుంటే 180 పరుగుల లక్ష్యం కూడా సరిపోయేది కాదు. మేం ప్రతీ మ్యాచ్‌కు పురోగతి సాధించాం.

ప్రతీ ఓటమి నుంచి గుణ పాఠం నేర్చుకున్నాం. చివరి 5 ఓవర్లలో 8-10 పరుగులు ఎక్కువగానే చేశాం. కొంచెం బౌన్స్ ఉండటంతో ఆరంభంలో ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం వికెట్‌పై పెద్ద రోలర్ తొక్కించడంతో వికెట్ ఫ్లాట్‌గా మారింది. టీమిండియాకు కూడా అద్భుతంగా ఆడింది. మాకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ సిరీస్‌ను 3-2తో కోల్పోయినా.. మేం తలెత్తుకుంటాం.'అని సింకదర్ రాజా చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, July 14, 2024, 11:01 [IST]
Other articles published on Jul 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+