Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: సికిందర్ రాజా

కీలక క్యాచ్‌లను నేలపాలు చేయడంతోనే భారత్ చేతిలో ఓటమిపాలయ్యామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా అన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 100 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికిందర్ రాజా.. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు ఘోర పరాజయానికి కారణమయ్యాయని చెప్పాడు. 'వరల్డ్ ఛాంపియన్స్.. వరల్డ్ ఛాంపియన్స్‌లాగే ఆడారు. క్యాచ్‌లు నేలపాలు చేయడం మా ఓటమిని శాసించింది. ఈ వికెట్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని నేను ముందే ఊహించాను. కానీ మేం అదనంగా 30 పరుగులు ఇచ్చాం.

IND vs ZIM Sikandar Raza says Dropping catcheshurt us today after India beat Zimbabwe in 2nd T20I

అయినా ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించా. కానీ మా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. బ్లెస్సింగ్ చాలా దూకుడుగా ఆడాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు. ఫిట్‌గా ఉన్నంత కాలం అతని గ్రాఫ్ ఆమాంతం పెరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మేం మా షాట్లు ఆడాం. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. అనుభవం లేమి కూడా మా పేలవ బ్యాటింగ్‌కు కారణమైంది.'అని సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Sunday, July 7, 2024, 20:43 [IST]
Other articles published on Jul 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+