Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: అందుకే ముకేష్ కుమార్‌, రియాన్‌ పరాగ్‌లను పక్కనపెట్టాం: శుభ్‌మన్ గిల్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. వరల్డ్ కప్ విజేతలు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో తుది జట్టు మార్పులు చేశామని చెప్పాడు.

సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చారని చెప్పిన శుభ్‌మన్ గిల్.. ముఖేష్ కుమార్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించి ఖలీల్ అహ్మద్‌లను తీసుకున్నామన్నాడు. వర్క్ లోడ్‌మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ విజేతల రీఎంట్రీతో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చిందన్నాడు. తమ జట్టు సమతూకంగా ఉందని.. బిగ్ హిట్టర్స్‌తో కావాల్సిన బ్యాటింగ్ డెప్త్ ఉందని గిల్ చెప్పుకొచ్చాడు.

IND vs ZIM Shubman Gill reveals the reason why Riyan Parag and Mukesh Kumar not playing in 3rd T20I

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని జింబాబ్వే సారథి సికిందర్ రాజా అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మేం అనుకున్నదే దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసేటప్పుడు ఈ వికెట్‌పై తేమ ఉండదు. అలాగని ఇది ఫ్లాట్ పిచ్ కాదు. పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొంచెం స్లో టర్న్ కూడా లభిస్తుందని ఆశిస్తున్నా.

రెండో టీ20 పరాజయంతో మా ఆటగాళ్లు కావాల్సిన గుణపాఠం నేర్చుకున్నారు. మేం మా బౌలర్లకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు భారత్‌ను తక్కువ స్కోర్ కట్టడి చేసేలా ప్రోత్సాహించాల్సి ఉంది. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఇన్నోసెంట్ కయా గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. మరుమని జట్టులోకి వచ్చాడు. లూక్ జోంగ్వే స్థానంలో నగర్వా బరిలోకి దిగుతున్నాడు.'అని సికందర్ రాజా చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్

జింబాబ్వే: తడి వన్షే మరుమణి, వెస్లీ మధెవెరె, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మేయర్స్, సికందర్ రాజా, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదండే(కీపర్), వెల్లింగ్టన్ మసకడ్జా, రిచర్డ్ నగర్వా, బ్లెస్సింగ్ ముజరబణి, టెండాయ్ చతరా.

Story first published: Wednesday, July 10, 2024, 16:25 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+