Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: అందుకే ఆ ముగ్గురు అరంగేట్రం చేస్తున్నారు: శుభ్‌మన్ గిల్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక సారథి శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది.

వికెట్ పెద్దగా మారే అవకాశం లేదు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచింది. కాబట్టి మా జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. అభిషేక్ శర్మ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ కెరీర్‌లో ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్నారు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

IND vs ZIM Shubman Gill Reveals The Reason Why India Have Three Debutants In 1st T20I

ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతోనే ఈ ముగ్గురు ఈ సిరీస్‌కు ఎంపికయ్యారని, టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే తుది జట్టులో చోటు దక్కించుకున్నారని చెప్పాడు.

మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జింబాబ్వే సారథి సికందర్ రాజా తెలిపాడు. 'ముందుగా బ్యాటింగ్ చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. పిచ్ చూడటానికి బాగుంది. జింబాబ్వే క్రికెట్ బోర్డు నాపై నమ్మకం ఉంచి సారథ్య బాధ్యతలు అప్పగించింది.
జింబాబ్వే క్రికెట్‌కు ఇది సంధి దశ. కుర్రాళ్లు తమ సత్తా చాటుతారని భావిస్తున్నా. కుర్రాళ్లతో కూడిన జట్టుకు నాయకత్వం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. సీన్ రిటైర్ అయ్యాడు. కుర్రాళ్లతో కూడిన జట్టు ఇది. 'అని సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

జింబాబ్వే: వెస్స్‌లీ మధెవెరె, ఇన్నోసెంట్ కయా, బ్రియన్ బెన్నెట్, సికిందర్ రాజా(కెప్టెన్), డియాన్ మేయర్స్, జోహ్‌నాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకడ్జా, లూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజర్బానీ, తెండాయ్ ఛత్రా

భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

Story first published: Saturday, July 6, 2024, 16:55 [IST]
Other articles published on Jul 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+