టీమిండియా తాత్కలిక సారథి శుభ్‌మన్ గిల్‌పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీష్ కెప్టెన్సీ అంటూ అతనిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. జింబాబ్వే పర్యటనలో టీమిండియాను నడిపిస్తున్న శుభ్‌మన్ గిల్.. ఆటగాడిగా, కెప్టెన్‌గా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. టీమిండియా వరుసగా రెండు విజయాలు అందించాడు.
బుధవారం జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మను ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపించారు. ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.

రెండో టీ20లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మను ఓపెనర్‌గా కొనసాగించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో ఆడాల్సి వచ్చింది. కానీ గత మ్యాచ్ జోరును అభిషేక్ శర్మ కొనసాగించలేకపోయాడు. 9 బంతుల్లో ఫోర్ సాయంతో 10 పరుగులే చేసి వెనుదిరిగాడు.
అభిషేక్ శర్మను ఓపెనర్‌గా పంపించి ఉంటే.. పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ ఉపయోగించుకొని ధాటిగా ఆడేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ డౌన్‌లో కంటే ఓపెనర్‌గానే అభిషేక్ శర్మ సత్తా చాటగలడని సూచిస్తున్నారు. కనీసం చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా అతన్ని ఓపెనర్‌గా ఆడించాలని కోరుతున్నారు.
అసలు శుభ్‌మన్ గిల్ టీ20లకు పనికిరాడని, టుక్ టుక్ బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.
శుభ్‌మన్ గిల్‌ది సెల్ఫీష్ కెప్టెన్సీ అని, అభిషేక్ శర్మ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లో భాగంగానే శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసినట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మలు ఇద్దరూ లెఫ్టాండర్స్ కావడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా ఆడించినట్లు అర్థమవుతోంది.
అభిషేక్ శర్మ ఓపెనర్‌గా కొనసాగాలంటే యశస్వి జైస్వాల్ ఫస్ట్ డౌన్‌లో ఆడాల్సి ఉంటుంది. మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15)కు ఓ వికెట్ దక్కింది.