For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ZIM: చెలరేగిన శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్!

జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో టీమిండియా 183 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీకి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు.

IND vs ZIM Shubman Gill 66 helps India 182 4 in 3rd T20 against Zimbabwe

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి జైస్వాల్(36) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ‌(10) తీవ్రంగా నిరాశపరిచాడు.

గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఈ మ్యాచ్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపించడంతో స్వేచ్చగా ఆడలేకపోయాడు. సికందర్ రాజా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌ సాయంతో శుభ్‌మన్ గిల్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అనంతరం దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం శుభ్‌మన్ గిల్‌ను ముజరబని ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో దూకుడుగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో భారీ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రెండు బౌండరీలతో సంజూ శాంసన్.. జట్టు స్కోర్‌ను 180 పరుగులు ధాటించాడు.

Story first published: Wednesday, July 10, 2024, 18:04 [IST]
Other articles published on Jul 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+