Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడినా.. భారత్‌ను వణికించాం: జింబాబ్వే కెప్టెన్

IND vs ZIM: Regis Chakabva Says It Was A Good Fight From The Boys In The Field

హరారే: పరాజయం పాలైనా తమ ఆట తీరుతో భారత జట్టును వణికించామని, ఓటమి భయం ఏంటో చూపించామని జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకబ్వా అన్నాడు. భారత్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సికిందర్ రాజా(95 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) అద్భుత సెంచరీతో భారత్‌కు ఘోర పరాభావం తప్పదేమోననిపించింది.

కానీ చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రెగిస్ చకబ్వా.. తమ ఆట తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియడాడు.

'ముందుగా విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. వారు అత్యద్భుతంగా ఆడారు. అయితే సికిందర్ రాజా, ఎవాన్స్ అద్భుత ప్రదర్శనతో భారత ఆటగాళ్లు చికాకుకు గురయ్యారు. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. జట్టులో ఆటగాళ్లంతా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చారు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్‌లో చాలా కష్టపడ్డారు. కఠిన పరిస్థితుల్లో సికిందర్ రాజా సెన్సేషనల్ బ్యాటింగ్‌తో విజయం దిశగా నడిపించాడు. ఈ సిరీస్‌లో మాకు ఎన్నో సానుకూలంశాలు లభించాయి. ఈ సిరీస్ మాకు ఓ గుణపాఠం'అని రెగిస్ చకబ్వా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. శుభ్‌మన్(97 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 130) సెంచరీకి తోడుగా ఇషాన్ కిషన్(61 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. అంతకుముందు ఓపెనర్లు రాహుల్(30), శిఖర్ ధావన్(40) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్(5/54) ఐదు వికెట్లతో చెలరేగగా.. విక్టర్, లూక్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. సికిందర్ రాజా(115) సెంచరీతో రాణించగా.. సీన్ విలియమ్స్(45), బ్రాడ్ ఎవాన్స్(28) పర్వాలేదనిపించాడు. బ్రాడ్ ఎవాన్స్‌తో కలిసి సికిందర్ రాజా 8వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. బ్రాడ్ ఔటైన మూడు పరుగుల వ్యవధిలోనే జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

Story first published: Monday, August 22, 2022, 21:40 [IST]
Other articles published on Aug 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+