Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా!(వీడియో)

టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ సూపర్ మ్యాన్ తరహాలో స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌కు బ్రియాన్ బెన్నెట్(4)నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఆవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ తొలి బంతిని ఆవేశ్ ఖాన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ దిశగా వేయగా.. బ్రియాన్ బెన్నెట్ కట్ షాట్ ఆడాడు. బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవి బిష్ణోయ్.. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్‌కు బిత్తరపోయిన బ్రియాన్ బెన్నెట్ నవ్వతూ క్రీజును వీడాడు.

IND vs ZIM Ravi Bishnoi leaves fans stunned with extraordinary flying catch

ఈ మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు.

Story first published: Wednesday, July 10, 2024, 21:42 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+