Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: రవి బిష్ణోయ్ కన్నెర్ర.. నిర్ణయం మార్చుకున్న అంపైర్! (వీడియో)

భారత్ , జింబాబ్వే మధ్య జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన చర్యతో నవ్వులు పూయించాడు. ఫీల్డ్ అంపైర్‌పై అతను కన్నెర్ర చేశాడు. దాంతో అంపైర్ తన నిర్ణయాన్నే మార్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

జింబాబ్వే ఇన్నింగ్స్ సందర్భంగా రవి బిష్ణోయ్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని జింబాబ్వే బ్యాటర్ జోనాథన్ కాంప్‌బెల్ రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన రవి బిష్ణోయ్ బ్యాటర్‌కు దూరంగా బంతిని వేసాడు. దాంతో బంతి కాంప్‌‌బెల్‌కు ఆఫ్‌స్టంప్‌కు దూరంగా పిచ్ అయ్యింది.

IND vs ZIM Ravi Bishnoi Forces Umpire To Reverse Wide Call Video goes viral

బ్యాటర్ రివర్స్ స్వీప్ కోసం తన స్టాన్స్‌ను మార్చుకోవడంతో వైడ్ బాల్ కాస్త లీగల్ డెలివరీగా మారింది. ఎడమ చేతి బ్యాటర్ అయిన కాంప్‌బెల్ రివర్స్ స్వీప్ కోసం తన స్టాన్స్‌ను మార్చుకున్నాడు. దాంతో లెగ్ స్టంప్‌గా పరిగణించాల్సిన బాంతి కాస్త ఆఫ్ స్టంప్‌ డెలివరీ అయ్యింది. ఈ విషయంలో అంపైర్ అయోమయానికి గురయ్యాడు.

ముందుగా వైడ్ ప్రకటించిన అతను.. రవి బిష్ణోయ్ సీరియస్ అవ్వడం చూసి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దాంతో రవి బిష్ణోయ్ నవ్వుకున్నాడు. ఈ వీడియోను నెటిజన్లు మోయే మోయే మ్యూజిక్‌తో ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. 24 గంటల వ్యవధిలోనే ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Monday, July 8, 2024, 17:28 [IST]
Other articles published on Jul 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+