Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్.. 12 ఏళ్ల తర్వాత..!

టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ చరిత్ర సృష్టించాడు. 12 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఓవర్లు మెయిడిన్ చేసిన భారత స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. ఇందులో రెండు ఓవర్లను మెయిడిన్ చేశాడు. దాంతో ఈ ఫీట్ సాధించిన రెండో భారత స్పిన్నర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రవి బిష్ణోయ్ కంటే ముందు హర్భజన్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు.

IND vs ZIM Ravi Bishnoi Achieves Rare Feat vs Zimbabwe Becomes First Indian spinner after 12 years

టీ20 ప్రపంచకప్ 2012లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ రెండు ఓవర్లను మెయిడిన్ చేసి ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత మరే భారత స్పిన్నర్ అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఓవర్లు మెయిడిన్ చేయలేదు. 12 ఏళ్ల తర్వాత రవి బిష్ణోయ్ ఈ ఘనతను అందుకున్నాడు.

ఓవరాల్‌గా భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్‌గా రవి బిష్ణోయ్ నిలిచాడు. హర్భజన్ సింగ్ తర్వాత పేసర్లు అయిన భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఫీట్ సాధించారు. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రెండు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. రవి బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసినా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. పేలవ బ్యాటింగ్ కారణంగా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) సత్తా చాటారు.

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియా అనూహ్యంగా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 27 ) మినహా అంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా(3/25), టెండాయ్ చతరా(3/16) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.

Story first published: Saturday, July 6, 2024, 21:59 [IST]
Other articles published on Jul 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+