పసలేని మ్యాచ్‌లు..
ఆరంభంలో వికెట్ నుంచి పేసర్లకు అడ్వాంటేజ్ లభిస్తుండటంతో రాహుల్ టాస్ గెలవగానే చేజింగ్‌కు మొగ్గు చూపుతున్నాడు. సునాయసంగా గెలిచేందుకు రాహుల్ ఇలా చేస్తున్నా.. అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ జింబాబ్వే ముందు ఉంచితే కనీసం భారత బ్యాటింగ్‌నైనా ఆస్వాదించవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డే అనంతరమే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని రాహుల్ ఏ మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రాహుల్ భయపడుతున్నావా?
జింబాబ్వే జట్టుకు కేఎల్ రాహుల్ భయపడుతున్నాడని, అందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకునే సాహసం చేయలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. అసలు రాహుల్ మగాడేనా? అని సెటైర్లు పేల్చుతున్నారు. పసికూనతో రిస్క్ చేయని రాహుల్.. పటిష్టమైన జట్లతో ఎలా ఆడుతాడని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో టీమిండియా దూకుడు మంత్రాన్ని జపిస్తుందని రోహిత్ శర్మ పదే పదే చెబుతున్నాడని, కానీ రాహుల్ మాత్రం దాన్ని డర్ అప్రోచ్‌గా మార్చేసాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మళ్లీ బౌలింగ్ ఎంచుకోవడం ఏంట్రా.. ఈ మ్యాచ్ కూడా చూడమ్ పో అని కామెంట్ చేస్తున్నారు.
ఒక్క మార్పుతో..
రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగిన టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. తొలి వన్డేలో జింబాబ్వే పతనాన్ని శాసించిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగాడు. అయితే ఈ మార్పునకు గల కారణాన్ని రాహుల్ వెల్లడించలేదు. దీపక్ చాహర్ ఏవో ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వికెట్ తొలి వన్డేలానే ఉందని, ఆ మ్యాచ్ ప్రదర్శనను రిపీట్ చేయాలనుకుంటున్నామని రాహుల్ వెల్లడించాడు.
తుది జట్లు:
జింబాబ్వే: ఇన్నోసెంట్ కియా, కైతానో, వెస్లీ, విలియమ్స్, సికందర్ రాజా, రెగిస్ చకబ్వా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, లూక్ జాంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్, తనక
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications
