Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: డబ్బా కొట్టేవారని పెట్టుకోవాలి.. సెలెక్టర్లపై కేకేఆర్ స్పిన్నర్ సెటైర్స్!

జింబాబ్వే పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు క్రికెటర్ వరుణ్ చక్రవర్తీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్‌తో టీమ్ సెలెక్షన్‌పై అసంతృప్తిని వెళ్లగక్కాడు. జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అందరూ ఊహించినట్లుగానే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

IND vs ZIM KKR Spinner Varun Chakravarthy Takes Dig At BCCI Selectors After India Snub

యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలెక్టర్లు.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్‌లకు ఈ జట్టులో అవకాశం కల్పించారు. వికెట్ కీపర్లుగా వెటరన్ ప్లేయర్ సంజూ శాంసన్‌తో పాటు యువ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. తెలుగు తేజం, పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటిన రియాన్ పరాగ్‌కు కూడా అవకాశం దక్కింది.

వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా చోటు దక్కించుకోగా.. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తుషార్ దేశ్‌పాండేలు పేసర్లుగా ఎంపికయ్యారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని సెలెక్టర్లు పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తికి గురైన వరుణ్ చక్రవర్తీ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. డబ్బా కొట్టే పీఆర్ ఎజెన్సీ లేకపోవడం వల్లనే సెలెక్టర్లు తన ప్రదర్శనను గుర్తించలేకపోయారని సెటైర్లు పేల్చాడు. 'నాకు ఓ పీఆర్ ఎజెన్సీ ఉండాల్సింది.'అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుణ్ చక్రవర్తీ 15 మ్యాచ్‌లు ఆడి 19.14 యావరేజ్, 8.04 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ అతను 20 వికెట్లు పడగొట్టాడు.

మిస్టరీ స్పిన్నర్ కోటాలోనే టీ20 ప్రపంచకప్ 2021కు ఎంపికైన వరుణ్ చక్రవర్తీ దారుణంగా విఫలమయ్యాడు. ఆ టోర్నీలో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. అప్పటి నుంచి వరుణ్ చక్రవర్తీ మళ్లీ టీమిండియా పిలుపు అందుకోలేదు.

Story first published: Monday, June 24, 2024, 20:26 [IST]
Other articles published on Jun 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+