IND vs ZIM: కొంపముంచిన ఇషాన్ కిషన్ అత్యుత్సాహం.. చేజేతులా రనౌట్! (వీడియో)

హరారే: టీమిండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ అత్యుత్సాహం ప్రదర్శించి మూల్యం చెల్లించుకున్నాడు. జింబాబ్వేతో మూడో వన్డేలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ తన శైలికి భిన్నంగా పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు. మరో బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఈ రనౌట్ విషయంలో ఇషాన్ కిషన్‌దే తప్పు. శుభ్‌మన్ గిల్‌తో సరైన సమన్వయం చేసుకోలేక పెవిలియన్ బాట పట్టాడు.

చూసుకోకుండా పరుగెత్తి..
అసలే ఈ మధ్య అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ కిషన్.. ఇలా క్రీజులో సెట్ అయిన తర్వాత రనౌట్‌గా వెనుదిరగడం అతన్ని మరింత నిరాశకు గురి చేసింది. 97 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్ చేస్తుండగా.. 43వ ఓవర్‌లో ఇషాన్ రనౌటయ్యాడు. ఇవాన్స్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని శుభ్‌మన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్లను తాకింది. దాంతో జింబాబ్వే ఆటగాళ్లు ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అయితే క్విక్ సింగిల్ తీయాలనే ఆలోచనతో ఇషాన్ కిషన్ పరుగెత్తుకొచ్చాడు. బంతి ఫీల్డర్ దగ్గరకు చేరిందనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయాడు.
యూటర్న్ తీసుకున్నా..
బ్యాటింగ్ చేయాలనే ఆతృతో లేక శుభ్‌మన్ మూమెంట్ ఇచ్చాడనో తెలియదు కానీ.. ఇషాన్ హాఫ్ క్రీజు ధాటాడు. ఇక బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన గిల్ వెనక్కి వెళ్లగా.. ఇషాన్ సైతం యూటర్న్ తీసుకున్నాడు. కానీ ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ వికెట్లను గిరాటేసింది. దాంతో నిరాశగా ఇషాన్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇషాన్ అత్యుత్సాహమే అతన్ని ఔట్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇషాన్ వల్ల గిల్ ఔటై ఉంటే సెంచరీ మిస్సయ్యేదంటున్నారు.

శుభ్‌మన్ గిల్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. శుభ్‌మన్(97 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 130) సెంచరీకి తోడుగా ఇషాన్ కిషన్(61 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. అంతకుముందు ఓపెనర్లు రాహుల్(30), శిఖర్ ధావన్(40) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్(5/54) ఐదు వికెట్లతో చెలరేగగా.. విక్టర్, లూక్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications