IND vs ZIM: సెంచరీతో వణికించిన సికిందర్ రాజా.. శుభ్‌మన్ స్కై డైవ్‌తో గట్టెక్కిన భారత్!

హరారే: జింబాబ్వే పర్యటనను భారత జట్టు దిగ్విజయంగా ముగించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయిన ఆతిథ్య జింబాబ్వే.. చివరి మ్యాచ్‌లో అసలు సిసలు ఆటతో భారత్‌ను వణికించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సికిందర్ రాజా(95 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) అద్భుత సెంచరీతో భారత్ పతనాన్ని శాసించేలా కనిపించాడు.

శుభ్‌మన్ స్టన్నింగ్ క్యాచ్..
కానీ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ సూపర్ ఫీల్డింగ్‌తో భారత్ ఆ ఘోర పరాభావాన్ని తప్పించుకుంది. చివరి 12 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన స్థితిలో శార్దూల్ వేసిన 49వ ఓవర్‌లో సికిందర్ రాజా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద శుభ్‌మన్ స్కైడైవ్‌తో అందుకున్నాడు. చివరి ఓవర్‌లో ఆవేశ్ ఖాన్.. విక్టర్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది.

శుభ్‌మన్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. శుభ్‌మన్(97 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 130) సెంచరీకి తోడుగా ఇషాన్ కిషన్(61 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. అంతకుముందు ఓపెనర్లు రాహుల్(30), శిఖర్ ధావన్(40) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్(5/54) ఐదు వికెట్లతో చెలరేగగా.. విక్టర్, లూక్ తలో వికెట్ తీసారు.

సికిందర్ రాజా ఒంటరి పోరాటం..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. సికిందర్ రాజా(115) సెంచరీతో రాణించగా.. సీన్ విలియమ్స్(45), బ్రాడ్ ఎవాన్స్(28) పర్వాలేదనిపించాడు. బ్రాడ్ ఎవాన్స్‌తో కలిసి సికిందర్ రాజా 8వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. బ్రాడ్ ఔటైన మూడు పరుగుల వ్యవధిలోనే జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications