Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: హార్దిక్, తిలక్ ఊచకోత.. చరిత్ర సృష్టించిన టీమిండియా!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా ఈ ఫీట్ సాధించింది.

హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్), అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) ఊచకోత బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది.

ఇషాన్ కిషన్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.

IND vs ZIM India Smash Record 256 4 Against Zimbabwe to Register Their Highest-Ever T20 World Cup Total

అయితే టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే టీమిండియాకు ఇది అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా రెండో టాప్ స్కోర్. 18వ ఓవర్‌లోనే 220 పరుగుల మార్క్ అందుకున్న టీమిండియా.. తమ పాత అత్యధిక స్కోర్ రికార్డ్‌ను అధిగమించింది. 2007లో ఇంగ్లండ్‌పై భారత్ 218/4 స్కోర్ నమోదు చేసింది. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండగా.. తాజా మ్యాచ్‌తో అధిగమించింది. అయితే మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ రికార్డ్ శ్రీలంక పేరిట ఉంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యాపై శ్రీలంక 260/6 స్కోర్ నమోదు చేసింది. ఈ రికార్డ్‌కు టీమిండియా 4 పరుగుల దూరంలో నిలిచింది. అయితే ఈ టోర్నీలో జింబాబ్వేపై వెస్టిండీస్‌ 254/6 నమోదు చేసిన రికార్డ్‌ను భారత్ అధిగమించింది.

టీ20 ప్రపంచ కప్‌లలో అత్యధిక స్కోర్లు :

260/6 శ్రీలంక వర్సెస్ కెన్యా - జోహన్నెస్‌బర్గ్ 2007

256/4 భారత్ వర్సెస్ జింబాబ్వే - చెన్నై 2026 *

254/6 వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే - వాంఖడే 2026

235/5 ఐర్లాండ్ వర్సెస్ ఒమన్ - కొలంబో SSC 2026

230/8 ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా - వాంఖడే 2016

229/4 సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ - వాంఖడే 2016

Story first published: Thursday, February 26, 2026, 22:17 [IST]
Other articles published on Feb 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+