Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: జింబాబ్వే‌పై టీమిండియా ఘన విజయం.. ఓటమికి పదింతల ప్రతీకారం!

జింబాబ్వే పర్యటనలో టీమిండియా తొలి విజయాన్నందుకుంది. ఐదు టీ20ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా 24 గంటల వ్యవధిలోనే పదింతల ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.

IND vs ZIM India beat Zimbabwe in 2nd T20I level the series courtesy of the Abhishek Sharma show

అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్ల ధాటికి ముగ్గురు బ్యాటర్లు ఖతా తెరవలేకపోయారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం(జులై 10) జరగనుంది. శనివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 102 పరుగులకు ఆలౌటైంది.

ఆ మరుసటి ఓవర్‌లో డియోన్ మేయర్స్(0), సికిందర్ రాజా(4)లను ఆవేశ్ ఖాన్ పెవిలియన్ చేర్చడంతో జింబాబ్వే 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జోనాథన్ కాంప్‌బెల్, మధెవెరె ఆచితూచి ఆడారు.

అయితే జోనాథన్(10)ను సుంధర్ ఔట్ చేయగా.. క్లైవ్ మదండే(0)ను రవి బిష్ణోయ్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. వెల్లింగ్టన్(1)ను జురెల్ సూపర్ త్రోతో రనౌట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన వెస్లీని రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి రెండు వికెట్లను ముఖేష్, ఆవేశ్ ఖాన్ పడగొట్టడంతో భారత విజయం లాంఛనమైంది.

Story first published: Sunday, July 7, 2024, 20:01 [IST]
Other articles published on Jul 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+