Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM టీ20 సిరీస్.. జియో సినిమా, హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

టీ20 ప్రపంచకప్ 2024 కైవసం చేసుకున్న టీమిండియా..జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వే వేదికగా శనివారం మొదలయ్యే ఈ సిరీస్ నుంచి ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరికి బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన కుర్రాళ్లకు అవకాశం కల్పించింది.

ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు చేరుకుంది. వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్‌పాండే జింబాబ్వేకు చేరుకోగా.. అమెరికాలో ఉన్న శుభ్‌మన్ గిల్ అక్కడి నుంచే జట్టుతో కలవనున్నాడు.

IND vs ZIM How to watch India vs Zimbabwe series 2024 for free

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను ముందుగా ఎంపిక చేసిన బీసీసీఐ వారు అందుబాటులోకి రాకపోవడంతో తొలి రెండు టీ20ల నుంచి తప్పించింది. వారి స్థానాల్లో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను ఎంపిక చేసింది.

ఇరుజట్ల మధ్య శనివారం నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్ర 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్:

తొలి టీ20: జూలై 6, హరారే స్పోర్ట్స్ క్లబ్

రెండో టీ20: జూలై 7, హరారే స్పోర్ట్స్ క్లబ్

మూడో టీ20: జూలై 10, హరారే స్పోర్ట్స్ క్లబ్

నాలుగో టీ20: జూలై 13, హరారే స్పోర్ట్స్ క్లబ్

ఐదో టీ20: జూలై 14, హరారే స్పోర్ట్స్ క్లబ్

ఏ ఛానెల్‌లో వస్తుందంటే..?
ఈ సిరీస్‌కు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ సోనీ లివ్ యాప్‌లో‌ కూడా ఈ మ్యాచ్‌లు రానున్నాయి.

ఫ్రీగా చూడాలంటే..?
ఇన్నాళ్లు భారత మ్యాచ్‌లను జియో సినిమా, హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూసిన జనాలు.. సోనిలివ్ యాప్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. టీవీ ఛానెల్స్‌కు కూడా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియోటీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్‌లో సోనీ టీవీ నెట్ వర్క్ ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోని మ్యాచ్‌లను లైవ్‌లో చూడవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

జింబాబ్వేతో తొలి రెండు టీ 20లకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా.

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.

Story first published: Wednesday, July 3, 2024, 17:05 [IST]
Other articles published on Jul 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+