Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL టీ20 సిరీస్.. జియో సినిమా, హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్దమైంది. మూడు టీ20లు, మూడు వన్డేల కోసం శ్రీలంకకు భారత్ వెళ్లనుంది. జూలై 27న మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌తో ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కానుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఈ పర్యటనతోనే తన బాధ్యతలను చేపట్టనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్‌‌కు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది. జట్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ నిర్ణయాలు కనిపించాయి.

IND vs ZIM How to watch India vs Sri Lanka T20I and ODI series 2024 for free

టీ20 ప్రపంచకప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లు ఉద్వాసనకు గురయ్యారు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్‌లు జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ఆవేశ్ ఖాన్‌లపై వేటు పడింది.

భారత్ వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్ షెడ్యూల్:

తొలి టీ20: జూలై 27, పల్లెకెలె(శనివారం)

రెండో టీ20: జూలై 28, పల్లెకెలె(ఆదివారం)

మూడో టీ20: జూలై 30, పల్లెకెలె(మంగళవారం)

భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్..

తొలి వన్డే: ఆగస్ట్ 2, కొలంబో(శుక్రవారం)

రెండో వన్డే: ఆగస్ట్ 4, కొలంబో(ఆదివారం)

మూడో వన్డే: ఆగస్ట్ 7, కొలంబో(బుధవారం)

ఏ ఛానెల్‌లో వస్తుందంటే..?
టీమిండియా విదేశీ సిరీస్‌లకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ సోనీ లివ్ యాప్‌లో‌ కూడా ఈ మ్యాచ్‌లు రానున్నాయి.

ఫ్రీగా చూడాలంటే..?
ఇన్నాళ్లు భారత మ్యాచ్‌లను జియో సినిమా, హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూసిన జనాలు.. సోనిలివ్ యాప్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. టీవీ ఛానెల్స్ కూడా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియోటీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్‌లో సోనీ టీవీ నెట్ వర్క్ ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్

టీమిండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Story first published: Saturday, July 20, 2024, 20:51 [IST]
Other articles published on Jul 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+