శ్రీలంక పర్యటనలో టీమిండియా మొదటి టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం ఉత్కంఠగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ విజయ ఉత్సాహంతోనే టీమిండియా వన్డే సిరీస్‌కు సమయాత్తమవుతోంది.
శుక్రవారం నుంచి కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లంతా ఆడనున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు.

సన్నాహకాలు షురూ..
హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌లోనే విజయాన్నందుకున్న గౌతమ్ గంభీర్.. వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లక్ష్యంగా ఈ సిరీస్‌తోనే సన్నాహకాలు ప్రారంభించనున్నాడు. టీ20 సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఆడుతున్న వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. మరోవైపు వన్డే సిరీస్‌లోనై విజయం సాధించి పరువు కాపాడుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు భావిస్తోంది.
భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే: ఆగస్ట్ 2, కొలంబో(శుక్రవారం)
రెండో వన్డే: ఆగస్ట్ 4, కొలంబో(ఆదివారం)
మూడో వన్డే: ఆగస్ట్ 7, కొలంబో(బుధవారం)
ఏ ఛానెల్‌లో వస్తుందంటే..?
భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ రెగ్యులర్‌గా చూసే హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలో రాదు. ఎందుకంటే టీమిండియా విదేశీ సిరీస్‌లకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లు రానున్నాయి.
ఫ్రీగా చూడాలంటే..?
ఇన్నాళ్లు భారత మ్యాచ్‌లను జియో సినిమా, హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూసిన జనాలు.. సోనిలివ్ యాప్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. టీవీ ఛానెల్స్ కూడా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియోటీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్‌లో సోనీ టీవీ నెట్ వర్క్ ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
టీమిండియా వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.