IND vs ZIM: రనౌట్ చేసి అప్పీల్ చేయని దీపక్ చాహర్.. బతుకుపో అంటూ ఉదారత..(వీడియో)

హరారే: టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన ఉదారత చాటుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసి కూడా అప్పీల్ చేయకుండా క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. జింబాబ్వేతో మూడో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌ను దీపక్ చాహర్ వేయగా.. ఇన్నోసెంట్ కియా నాన్ స్ట్రైకర్‌గా ఉన్నాడు. అయితే దీపక్ చాహర్ బౌలింగ్ వేయకముందే ఇన్నోసెంట్ కియా క్రీజును ధాటాడు.
ఇది గుర్తించిన దీపక్ చాహర్ బౌలింగ్ చేయడం ఆపి వికెట్లను కొట్టాడు. కానీ అప్పీల్ చేయకుండా బ్యాటర్‌వైపు నవ్వుకుంటా చూస్తూ మళ్లీ బౌలింగ్‌కు సిద్దమయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. దాంతో అంపైర్ డెడ్‌బాల్‌గా పరగణించాడు.
క్రికెట్ నిబంధనల ప్రకారం అది రనౌట్. గతంలో మన్కడింగ్‌గా పిలిచేవారు. కానీ ఇటీవల మెరిలిన్ క్రికెట్ బోర్డు ఆ పేరును తొలగించి రనౌట్‌గా పరిగణించాలని పేర్కొంది. అనైతికం కాదని కూడా స్పష్టం చేసింది. 2019 ఐపీఎల్‌లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు. అప్పట్లో ఇది పెద్ద దూమారమే రేపింది. అయితే కొందరు అశ్విన్‌ను సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. ఈ క్రమంలో ఈ నిబంధనపైన పునరాలోచన చేసిన మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇకపై మన్కడింగ్‌ను లా-41 అనైతికం నుంచి లా-38 ప్రకారం రనౌట్‌గా మార్చింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. శుభ్‌మన్(97 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 130) సెంచరీకి తోడుగా ఇషాన్ కిషన్(61 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. అంతకుముందు ఓపెనర్లు రాహుల్(30), శిఖర్ ధావన్(40) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్(5/54) ఐదు వికెట్లతో చెలరేగగా.. విక్టర్, లూక్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే ఓటమి దిశగా సాగుతోంది. భారత బౌలర్ల ధాటికి 169 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. సీన్ విలియమ్స్(45), సికిందర్ రాజా(46 నాటౌట్) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications