Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: అభిషేక్ శర్మ విధ్వంసం.. 46 బంతుల్లో శతకం!

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన ఈ సన్‌రైజర్స్ బ్యాటర్.. రెండో మ్యాచ్‌లో మాత్రం శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ.. ఐపీఎల్ తరహా బ్యాటింగ్‌తో చెలరేగాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. మరో 13 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని రెండో ఇన్నింగ్స్‌లోనే శతకాల ఖాతా తెరిచాడు. మసకడ్జా వేసిన 14వ ఓవర్‌లో భారీ సిక్స్ బాది.. శతకం పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. మరుసటి బంతికే ఔటయ్యాడు.

IND vs ZIM Abhishek Sharma hits maiden T20I hundred in second match

ఈ సెంచరీతో అభిషేక్ శర్మ పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 38 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే తొలి శతకం బాదిన మొదటి భారత బ్యాటర్‌గా కూడా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనే అభిషేక్ శర్మ తొలి టీ20 సెంచరీ అందుకోగా.. దీపక్ హుడా మూడు ఇన్నింగ్స్‌ల తర్వాత, కేఎల్ రాహుల్ నాలుగు ఇన్నింగ్స్‌ల తర్వాత శతకాలు నమోదు చేశారు.

అభిషేక్ శర్మ శతకానికి రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77), రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ తోడవ్వడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(2) ఒక్కడే నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, July 7, 2024, 18:17 [IST]
Other articles published on Jul 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+