
కోల్‌కతా: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ టీ20లో మంచు తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అన్నాడు. ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ జట్టులోకి రాగా ఫాబియన్ అలెన్ ఉద్వాసనకు గురయ్యాడని చెప్పాడు.
ఇక ఔట్ ఫీల్డ్‌లో లైట్స్ ఉన్నాయని, తాము తమ షాట్స్ ఆడి భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ముఖ్యంగా పవర్ ప్లేను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టు ఆటతీరును మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తామని చెప్పాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. దాంతో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌లకు నిరాశే ఎదురైంది.
మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇదే జోరులో ఈ మ్యాచ్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. తద్వారా చివరి మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది. ఈ మ్యాచ్ కీరన్ పొలార్డ్ కెరీర్‌లో 100వ ఇంటర్నేషన్ టీ20 కావడం గమనార్హం.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, రవి బి కీష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, రమేశ్ పొవెల్, కీరన్ పొలార్డ్, జాసన్ హోల్డర్, అకీలా హోస్సెన్, స్మిత్, రోమియో షెఫెర్డ్, షెల్డన్ కాట్రెల్