డొమినికా: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ తెలిపాడు. 'ఈ పిచ్ సాధారణంగా పొడిగా ఉంటుంది. కానీ తొలి గంటలో కాస్త మాయిశ్చర్ ఉంటుంది. అంటిగ్వాలో మేం 10 రోజుల క్యాంప్ నిర్వహించాం. లారా పర్యవేక్షణలో ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యాం.
గత రెండు డబ్ల్యూటీసీ ఫైనల్లో మేం మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ సారి మా అభిమానులు తల ఎత్తుకునేలా ఆడాలనుకుంటున్నాం. ఈ టోర్నీలో విజేతగా నిలవాలంటే నిలకడగా రాణించడం చాలా ముఖ్యం. జట్టులోని ఆటగాళ్లంతా సానుకూల ఆలోచనలతో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్‌తో అలిక్ అథనజే అరంగేట్రం చేస్తున్నాడు.'అని బ్రాత్‌వైట్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రాక్టీస్ గేమ్ కూడా ఆడి ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నామని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్ రెండేళ్ల పాటు సాగే టోర్నీ అని, నిలకడగా రాణించడం చాలా ముఖ్యమని తెలిపాడు.
అత్యుత్తమ ప్రదర్శనతోనే రెండు సార్లు ఫైనల్ చేరామని, ఈ సారి అదే ప్రదర్శనను పునరావృతం చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌తో ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారని చెప్పిన రోహిత్.. వారు సత్తా చాటుతారనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు.
అందరూ ఊహించినట్లుగానే టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు చేశారు. యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్ జట్టులోకి రాగా.. తెలుగు తేజం కేఎస్ భరత్‌పై వేటు వేసారు. మూడో పేసర్‌గా జయదేవ్ ఉనాద్కత్‌కు అవకాశం ఇచ్చారు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్.
వెస్టిండీస్: బ్రాత్‌వైట్(కెప్టెన్), బ్లాక్‌వుడ్, టీ చంద్రపాల్, జాసన్ హోల్డర్, కీమచ్ రోచ్, డ సిల్వా, అతంజా, రకీమ్ కాన్వెల్, అల్జారీ జోసెఫ్, జే వర్రికన్