Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు!

IND vs WI: Virat Kohli Scores His 30th Fifty In The Second T20 Match

కోల్‌కతా: నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు టచ్‌లోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించాడు. వన్డే సిరీస్‌తో పాటు తొలి టీ20లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మూడో టీ20లో తనదైన బ్యాటింగ్‌తో విరాట్ విమర్శకులకు సమాధానం చెప్పాడు. అయితే హాఫ్ సెంచరీ ఔటైన వెంటనే.. చేస్ సూపర్ డెలివరీకి ఔటయ్యాడు. అయితే కోహ్లీకి ఇది కెరీర్‌లో 30వ టీ20 హాఫ్ సెంచరీ. కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంపై అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. షెల్డన్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(2) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే కాట్రెల్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బ్రాండన్ కింగ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రోహిత్ బౌండరీలు బాదాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 6వ ఓవర్‌లో కోహ్లీ రెండు బౌండరీలు బాదగా.. రోహిత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టానికి 49 రన్స్ చేసింది. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గగా.. చేస్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(19) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో జోరు కనబర్చినా.. ఔటవ్వడానికి ఎంతో సేపు పట్టలేదు. చేజ్ బౌలింగ్‌లో సూర్య(8) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన పంత్.. వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. రోస్టన్ చేజ్.. వేసిన 14వ ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మార్చిన విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే బౌండరీ లైన్ వద్ద జాసన్ హోల్డర్ ఈ క్యాచ్ వదిలేయడంతో విరాట్ కోహ్లీకి లైఫ్ రావడంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Story first published: Friday, February 18, 2022, 20:24 [IST]
Other articles published on Feb 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+