IND vs WI:బయో బబుల్ వీడిన విరాట్ కోహ్లీ.. మూడో టీ20తో పాటు ఆ సిరీస్‌కు దూరం!

కోల్‌కతా: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బయో బబుల్‌ను వీడాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో విరాట్ కోల్‌కతా నుంచి ముంబై బయలుదేరాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. సీరిస్ గెలిచిన నేపథ్యంలో మూడో టీ20లో బెంచ్ ఆటగాళ్ల సత్తాను పరీక్షించే అవకాశం ఉంది.

బెంచ్ టీమ్‌కు చాన్స్..
సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీతో పాటు దీపక్ చాహర్, భువనేశ్వకుమార్, యుజ్వేంద్ర చాహల్, రిషభ్ పంత్‌లకు ఆదివారం జరిగే మూడో టీ20 నుంచి రెస్ట్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే విరాట్.. జట్టు బయో బబుల్‌ను వీడి ముంబై పయనమయ్యాడు. ఇక ఫిబ్రవరి 24 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు కూడా కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలోనే అతను బబుల్ వీడి ఫ్యామిలితో గడిపేందుకు ముంబై వెళ్లాడు.
బోర్డింగ్ పాస్ వైరల్..
ఇక విరాట్ బయో బబుల్ వీడటంపై ఇప్పటి వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే విరాట్ ముంబైకి వెళ్లినట్లు బోర్డింగ్ పాస్‌లు స్పష్టం చేస్తున్నారు. ఈ ఉదయం 9.10 గంటల ఫ్లైట్‌కు విరాట్ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బోర్డింగ్ పాస్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక గత కొంత కాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడ్డ విరాట్.. విండీస్‌తో జరిగిన రెండో టీ20లో లయ అందుకున్నాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు.

30వ హాఫ్ సెంచరీ..
ఓపెనర్లు రోహిత్ శర్మ(19), ఇషాన్ కిషన్(2) త్వరగా ఔటైన వేళ.. తనదైన క్లాస్ బ్యాటింగ్‌తో టీమ్‌కు గట్టి పునాది వేసాడు. విరాట్‌కు ఇది కెరీర్ 30వ టీ20 హాఫ్ సెంచరీ. సూపర్ బ్యాటింగ్‌తో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేశాడు. దాంతో రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ స్వేచ్చగా ఆడుతూ టీమిండియాకు భారీ స్కోర్ అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), రిషభ్ పంత్(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

రఫ్ఫాడించిన భువీ..
వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులే చేసి ఓటమి పాలైంది. నికోలస్ పూరన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), రోమన్ పోవెల్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి పూరన్ ఔట్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications