భారత ఆటగాళ్ల మధ్య..
ఈ వికెట్ విషయంలో తొలుత అంపైర్ నాటౌటివ్వగా.. రివ్యూకెళ్లిన భారత్ ఫలితం రాబట్టింది. అయితే ఈ రివ్యూ తీసుకునే విషయంలో భారత ఆటగాళ్ల మధ్య సరదా సంభాషణ నడిచింది. చాహల్ వేసిన షార్ప్ టర్నింగ్ బాల్‌ను అంచనా వేయలేకపోయిన బ్రూక్స్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్రూక్స్ బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ చేతిలో పడింది. భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ బ్యాట్‌కు తగలలేదని నాటౌటిచ్చాడు.
ఏమో సార్ నాకు తెలియదు..
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ.. పంత్‌ను బ్యాట్‌కు తాకిందా? అని ప్రశ్నించగా.. 'నాకు తెలియదు బ్రో'అని అతను అనడం స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. ఆ వెంటనే విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుంటూ.. 'రోహిత్.. బంతి బ్యాట్‌కు తాకింది. రివ్యూ తీసుకో'అంటూ కన్విన్స్ చేశాడు. విరాట్ మాటతో రోహిత్ రివ్యూ తీసుకోగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తప్పని తేలింది. దాంతో బ్రూక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మూడు రివ్యూలు సక్సెస్..
ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ తీసుకున్న మూడు రివ్యూలు సక్సెస్ అయ్యాయి. అతని ఫీల్డ్ సెటప్ కూడా బౌలర్లకు చాలా హెల్స్ అయ్యింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్.. రోహిత్ మార్క్ కెప్టెన్సీకి బలయ్యాడు. వాషింగ్టన్ సుంధర్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ అండ్ మిడ్ వికెట్ ఫీల్డ్‌ను మార్చగా.. ఆ వెంటనే బ్రాండన్ కింగ్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.

చెలరేగిన చాహల్..
ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(4/49) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్(3/30) మూడు, ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీశారు. వీరికి తోడుగా సిరాజ్ కూడా ఓ వికెట్ పడగొట్టడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌లో జాసన్ హోల్డర్ (71 బంతుల్లో 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ హోల్డర్ ఆ జట్టు పరువును కాపాడాడు.


Click it and Unblock the Notifications
