For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారంతా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ ఎందుకయ్యా? మాజీ పేసర్ ఫైర్

Venkatesh Prasad questions Shreyas Iyer

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో చోటివ్వడాన్ని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తప్పుబట్టాడు. విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్ ఉండగా.. అయ్యర్ అవసరం భారత టీ20 జట్టుకు లేదన్నాడు. వన్డే సిరీస్‌లో నిలకడగా ఆడిన శ్రేయస్ అయ్యర్‌ విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్‌ నాలుగు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

ఈ క్రమంలోనే శ్రేయస్‌ను ఎంపిక చేయడంపై పేసర్‌ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. అయితే వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌కు క్రికెట్ అభిమాని ప్రతిస్పందించగా.. దానికీ కూడా ఈ భారత మాజీ పేసర్ బదులిచ్చాడు.'సెలెక్షన్‌ కమిటీలో కొంతమంది వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును తయారు చేస్తున్నామని గతంలో చెప్పారు. అయితే ఇప్పటికే సంజూ శాంసన్‌, దీపక్ హుడా, ఇషాన్ కిషన్‌ వంటి ప్లేయర్లు టీ20 టీమ్‌లో ఉన్నప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌ ఉండటం సరిగా అనిపించలేదు. ఎందుకంటే ప్రపంచకప్‌ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ కచ్చితంగా ఉంటారు. అందుకే సరైన బ్యాలెన్స్‌ చేయడానికి మిగతా సభ్యుల ఎంపికపై దృష్టిపెట్టాలి'' అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.

అయితే వెంకటేశ్‌ ప్రసాద్ చేసిన ట్వీట్‌కు ఓ క్రికెట్ అభిమాని స్పందిస్తూ.. 'ఈ మ్యాచ్‌ ముందు వరకు శ్రేయస్‌ చాలా బాగా ఆడాడు.. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆడలేకపోయాడు' అని రీట్వీట్ చేశాడు. అభిమాని ట్వీట్‌కు వెంకటేశ్‌ ప్రసాద్ సమాధానం ఇచ్చాడు. 'శ్రేయస్ 50 ఓవర్ల క్రికెట్‌లో చాలా బాగా ఆడాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో శ్రేయస్‌ కంటే ఉత్తమ ఆటగాళ్లు ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. టీ20ల్లోకి రావాలంటే శ్రేయస్‌ తన నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుచుకోవాలి'అని బదులిచ్చాడు. వెంకటేశ్ ప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరేమో మద్దతు తెలపగా.. మరికొందరు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీని కూడా ఇలా చూడాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Saturday, July 30, 2022, 22:03 [IST]
Other articles published on Jul 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+