Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: సూర్య కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన విండీస్ ఓపెనర్!( వీడియో)

గయానా: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో సత్తా చాటాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వెస్టిండీస్ ఓపెనర్ బ్యాండన్ కింగ్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సూపర్ డైవ్‌తో అందుకున్నాడు.

అచ్చం చేపపిల్లాలా డైవ్ చేసిన సూర్య ఫీల్డింగ్‌కు బ్రాండన్‌ కింగ్ బిత్తరపోయాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని బ్రాండన్ కింగ్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సూర్య సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. దాంతో బ్రాండన్ కింగ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs WI: Suryakumar Yadav takes Unbelievable Diving Catch to dismiss Brandon King

అనంతరం క్రీజులోకి జాన్సన్ చార్లెస్(2) రెండు బంతుల వ్యధిలోనే పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో వెస్టిండీస్ నాలుగు బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతో సేపు లేదు. క్రీజులోకి వచ్చిన డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

కైల్ మేయర్స్ కూడా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అతనికి అర్ష్‌దీప్ సింగ్ కళ్లెం వేసాడు. ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. మూడు వికెట్లు కోల్పోయినా పూరన్ దూకుడు తగ్గించలేదు. ముకేష్ కుమార్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన అతను రవిబిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. దాంతో విండీస్ పవరర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.

Story first published: Sunday, August 6, 2023, 22:46 [IST]
Other articles published on Aug 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+