Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: అందుకే తుది జట్టులో మార్పులు చేయలేదు: శుభ్‌మన్ గిల్

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మేం నిలకడగా రాణించాలని, గత మ్యాచ్ ప్రదర్శననే పునరావృతం చేయాలని భావిస్తున్నాం. కెప్టెన్సీని భారంగా భావించడం లేదు. కాపోతే బాధ్యత పెరిగింది. నాకు సవాళ్లు అంటే ఇష్టం. వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ పొడిగా కనిపిస్తోంది. అయితే టాస్ గెలవనందుకు ఎలాంటి ఆందోళన లేదు. మేము జట్టుగా ఈ మ్యాచ్ గురించి అనేక చర్చలు జరిపాం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో 90 ఓవర్లు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. నిలకడగా బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నాం.

IND vs WI Shubman Gill Reveals Why India XI Unchanged in the 2nd Test Against West Indies

మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. బ్రాండన్ కింగ్, జోహాన్ లేన్ స్థానంలో అండర్సన్ ఫిలిప్, తేవిమ్ ఇమ్లాచ్ జట్టులోకి వచ్చారు. కొత్త బంతితో అండర్సన్ ఫిలిప్ రాణించగలడు. కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఇమ్లాచ్ గయానా నుంచి వచ్చాడు. అతను స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడుతాడు. ఈ వికెట్‌కు అతను సరిగ్గా పోతాడని తుది జట్టులోకి తీసుకున్నాం.'అని రోస్టన్ ఛేజ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

వెస్టిండీస్:

జాన్ క్యాంప్‌బెల్, టేగనరైన్ చందర్‌పాల్, అలిక్ అతానాజ్, షై హోప్, రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.

ఇండియా:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Story first published: Friday, October 10, 2025, 9:25 [IST]
Other articles published on Oct 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+