Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI తొలి వన్డేకు రవీంద్ర జడేజా దూరం.. ఎందుకంటే?

IND vs WI: Shikhar Dhawan Gives Big Update On Ravindra Jadeja’s Injury Ahead Of 1st ODI

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమైన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో టీమ్ వైస్ కెప్టెన్‌‌గా జట్టుకు ఎంపికైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తొలి వన్డే ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అతను చిన్న గాయంతో బాధపడుతున్నాడని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. అతను తొలి వన్డేకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదన్నాడు. అయితే జడేజాను భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డే నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జడేజా ఆడటం డౌట్..

జడేజా ఆడటం డౌట్..

'ప్రస్తుతం రవీంద్ర జడేజా మైనర్ ఇంజ్యూరీతో బాధపడుతున్నాడు. తొలి వన్డేకు అతను సిద్దంగా ఉన్నాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలతో మాకు అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉంది. స్పిన్ కేటగిరిలో అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్‌లు ఉన్నారు. ఈ ఇద్దరూ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు.'అని జడేజా గాయంపై ధావన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే అప్‌కమింగ్ టోర్నీలు, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జడేజా విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ రిస్క్ చేయకపోవచ్చు. తొలి వన్డే నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. అవసరమైతే అతని గాయం నయం అయ్యేవరకు బెంచ్‌కే పరిమితం చేయవచ్చు.

ఉత్సాహంగా ఉన్నాం..

ఉత్సాహంగా ఉన్నాం..

వెస్టిండీస్ పర్యటనలో జట్టును నడిపించేందుకు తాను సిద్దంగా ఉన్నానని శిఖర్ ధావన్ తెలిపాడు. 'జట్టును నడిపించేందుకు ఉత్సాహంగా ఉన్నా. యువకుల బృందానికి సారథ్యం వహించే అవకాశం వచ్చినప్పుడల్లా నా అనుభవాన్ని వారితో పంచుకుంటా. ఇలా చేయడాన్ని నేను చాలా ఇష్టపడుతా. నా అనుభవం వారి ఆటపై ప్రభావం చూపేలా ప్రయత్నిస్తా. ప్రతీ ఒక్కరికి నైపుణ్యం ఉంటుంది. కానీ మానసిక అంశం చాలా కీలకం. వర్షం కారణంగా మేం పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు. కానీ ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు.

ప్రాక్టీస్ లేకుండానే..

ప్రాక్టీస్ లేకుండానే..

ముఖ్యంగా యువ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. యూకేలో సత్తాచాటడంతో ప్రాక్టీస్ లేకున్నా ప్రభావం చూపగలరు. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉండేలా ఎంపిక చేస్తాం. సూర్యకుమార్ యాదవ్ అనుభవమైన ఆటగాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త. కానీ అతనికి కావాల్సిన పరిణతి ఉంది. శ్రేయస్, శార్దూల్ చాలా కలంగా జట్టుకు ఆడుతున్నారు.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్‌తో గుడ్ రిలేషన్..

ద్రవిడ్‌తో గుడ్ రిలేషన్..

ద్రవిడ్‌తో ఇన్‌స్టా రీల్ చేయడంపై స్పందించిన ధావన్ అతనితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పాడు. 'రాహుల్ ద్రవిడ్ భాయ్‌తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతేడాది మేం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. అక్కడ మా మధ్య మంచి బంధం ఏర్పడింది. ఒకరికొకరం బాగా అర్థం చేసుకున్నాం. అందర్ని ఒక్క దగ్గరికే చేర్చే శక్తి నాకుందని ఫీలవుతాను. ఇటీవల నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశాను. అందులో రాహుల్ భాయ్ కూడా ఉన్నాడు. ఈ రోజు ప్రపంచం మొత్తం రీల్స్ నడుస్తున్నాయి. గతంలో టీమ్ డిన్నర్ టైమ్‌లో చేసేవాళ్లం'అని ధావన్ తెలిపాడు.

Story first published: Friday, July 22, 2022, 12:00 [IST]
Other articles published on Jul 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+