న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ మరోసారి కుప్పకూలింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(55), శుభ్‌మన్ గిల్(34) తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని అందించినా.. భారత మిడిలార్డర్ అందిపుచ్చుకోలేకపోయింది. దాంతో భారత్ 22 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో అవకాశం అందుకున్న సంజూ శాంసన్(9), అక్షర్ పేటల్(1) దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అవకాశాన్ని అందుకున్న సంజూ శాంసన్ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 19 బంతులాడి 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. యానిక్ కారయ్యా బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా ఔటయ్యాడు.

అయితే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సంజూ శాంసన్ అట్టర్ ఫ్లాఫ్ కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటే సంజూ మాత్రం ఐపీఎల్ స్థాయి ధాటి రాడని సెటైర్లు పేల్చుతున్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్, కేరళ పీఆర్ మీడియా, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌కు అనవసర ప్రాధాన్యత ఇస్తూ పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తే అతను మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్పుకొని అవకాశం ఇస్తే ఇంత దారుణంగా విఫలమవుతారా? అని మండిపడుతున్నారు.
అక్షర్ పటేల్(1) సైతం దారుణంగా విఫలమయ్యాడు. రోమారియో షెఫర్డ్ బౌన్సర్‌కు కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అతనిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదీ ఏమైనా ఈ తరహా బ్యాటింగ్ టీమిండియాకు నష్టం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుండగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ఆగిపోయిన సమయానికి 24.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(0) మాత్రమే ఉన్నాడు.