IND vs WI:రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్స్.. నోరెళ్లబెట్టిన పొలార్డ్! (వీడియో)

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రాత్మక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తమ 1000 వన్డేను చిరస్మరణీయం చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ కొట్టిన పుల్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అతను ఆడిన ఈ షాట్‌కు విండీస్ కెప్టెన్ పొలార్డ్ నోరెళ్ల బెట్టాడు.
లడ్డూ లాంటి బంతి..
భారత ఇన్నింగ్స్ సందర్భంగా అల్జారీ జోసెఫ్ వేసిన 10వ ఓవర్‌లో హిట్ మ్యాన్ తన ట్రేడ్ మార్క్ షాట్ ఆడాడు. జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను లడ్డూలా భావించిన హిట్ మ్యాన్ తనదైన శైలిలో పుల్ షాట్‌గా సిక్సర్ బాదాడు. ఆ షాట్‌ను చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. విండీస్ కెప్టెన్ పొలార్డ్ అయితే 'ఏం బంతి వేసావు రా అయ్యా?'అంటూ బౌలర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఇక రోహిత్ శర్మకు షాట్ పిచ్ బాల్స్ ఆడటం సరదా అనే విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ అలవోకగా పుల్ షాట్లు బాదుతుంటాడు.
షాట్ బాల్ వేస్తాడా?
అయితే ఈ షాటే అతని బలహీనత కూడా. రోహిత్‌ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి టీమ్స్ ఊరించే షాట్ బాల్స్‌తో ప్రణాళికలు రచిస్తుంటాయి. 90 శాతం వరకు రోహిత్ ఎలాంటి తప్పిదం లేకుండా ఈ షాట్‌ను చక్కగా ఆడుతుంటాడు. కానీ కొన్ని సార్లు బంతిని అంచనా వేయడంలో తప్పిదం చేసి క్యాచ్ ఔట్‌గా మూల్యం చెల్లించుకుంటాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు షార్ట్ బాల్ వేయడంపై కీరన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ గురించి పొలార్డ్ బాగా తెలుసు.

చెలరేగిన చాహల్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ (71 బంతుల్లో 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(4/49) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్(3/30) మూడు, ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీశారు. వీరికి తోడుగా సిరాజ్ కూడా ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ హోల్డర్ ఆ జట్టు పరువును కాపాడాడు.
సునాయసంగా..
అనంతరం టీమిండియా 28 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా.. ఇషాన్ కిషన్(28), సూర్యకుమార్ యాదవ్(34 నాటౌట్), దీపక్ హుడా(26 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీయగా.. అకీల హోస్సెన్‌కు ఓ వికెట్ దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(8), రిషభ్ పంత్(11) మరోసారి నిరాశపరిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications