హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ భారత టెస్ట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. వచ్చే నెల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ టీమ్‌లోకి యశస్వీ జైస్వాల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు వేసి మరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే యశస్వీ రాకతో టీమ్‌కాంబినేషన్‌పై సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడే యశస్వీ జైస్వాల్‌ను ఏ ప్లేస్‌లో బ్యాటింగ్ పంపిస్తారా? అనేది సందేహంగా మారింది. పుజారా స్థానంలో నెంబర్-3లో ఆడిస్తారా? లేక ఓపెనర్‌గా బరిలోకి దించుతారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఓపెనర్‌గా ఆడిస్తే ఎవర్నీ మిడిలార్డర్‌కు పంపిస్తారు? రోహిత్ శర్మనా? లేక శుభ్‌మన్ గిల్‌నా? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి.

మరోవైపు యశస్వీ అభిమానులు మాత్రం అతనికి ఓపెనర్‌గానే అవకాశం ఇవ్వాలని, కనీసం అరంగేట్ర మ్యాచ్‌లోనైనా అలా పంపించాలని కోరుతున్నారు. కొందరైతే రోహిత్ శర్మను మిడిలార్డర్‌లోకి పంపించి గిల్, యశస్వీని ఓపెనర్లుగా ఆడించాలని సూచిస్తున్నారు. తద్వారా లెప్ట్ రైట్ కాంబినేషన్ లభిస్తుందని సలహా ఇస్తున్నారు.
ప్రముఖ కామెంటేర్ హర్షాభోగ్లే సైతం యశస్వీని ఓపెనర్‌గా ఆడించే అవకాశాలున్నాయని తెలిపాడు. శుభ్‌మన్ గిల్‌ను నెంబర్-3లో ఆడించి యశస్వీని ఓపెనర్‌గా ఆడించవచ్చని ట్వీట్ చేశాడు. మరోవైపు టెస్ట్ టీమ్‌లో చోటు దక్కడంపై యశస్వీ జైస్వాల్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత జట్టు తరఫున బరిలోకి దిగడం తన కలని, అది నెరవేరే సమయం ఆసన్నమైందన్నాడు.
జూలై 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా.. ఆతిథ్య వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ప్రస్తుతం విరామంలో ఉన్న టీమిండియా వచ్చే నెల మొదటి వారంలో విండీస్ బయల్దేరనుంది. టెస్ట్ సిరీస్‌కు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.