
సెయింట్ కిట్స్: భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడు. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20 ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్‌తో సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. ఆ వెంటనే బౌండరీ బాది జోరు కనబర్చాడు. ఆ మరుసటి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు రెండు బంతులను లెగ్ సైడ్ స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్‌కు వీపు కండరాలు పట్టేసినట్లు అనిపించింది. తొడ కండరాల గాయం కూడా తిరగబెట్టినట్లుంది.
దాంతో కాస్త అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. తీరని నొప్పితో అల్లాడిపోయాడు. శరీరాన్ని బలంగా తిప్పడంతో ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఫిజియోలు అతన్ని పరీక్షించి మైదానం బయటకు తీసుకుపోయారు. దాంతో రోహిత్ 5 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. అయితే మున్ముందు కీలక టోర్నీలు ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ అసౌకర్యానికి గురవ్వడం చూసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే రోహిత్ సాధారణ గాయం అయితే మాత్రం అతను రెండు మూడు రోజుల్లో మైదానంలోకి బరిలోకి దిగుతాడు. పెద్ద గాయం అయితే కనీసం 5 వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే భారత్‌కు తీరని నష్టం జరుగుతోంది. అయితే అతని గాయంపై బీసీసీఐనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) ధాటిగా ఆడాడు. రోవ్‌మన్ పొవెల్ (14 బంతుల్లో 23) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రోహిత్ సేన 8.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. క్రీజులో సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు.