Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!

డొమినికా: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రెండో భారత ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.

రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో అల్జారీ జోసెఫ్ వేసిన 36 ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదిన రోహిత్ శర్మ.. రకీమ్ కార్న్‌వాల్ వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి 106 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 102వ హాఫ్ సెంచరీ.

Rohit Sharma

ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 120 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 102 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ 101 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో 3500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.

యశస్వీ జైస్వాల్‌తో కలిసి 17 ఏళ్ల తర్వాత విండీస్ గడ్డపై 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఓపెనింగ్ జోడిగా చరిత్రకెక్కాడు. భారత్ తరఫున 13 టెస్ట్‌ల తర్వాత 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఓపెనర్‌గా నిలిచాడు.

80/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత ఓపెనింగ్ జోడీ.. ఆచితూచి ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూనే వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిచింది. అల్జారీ జోసెఫ్ వేసిన 33 ఓవర్ రెండో బంతిని యశస్వీ బౌండరీ బాది కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ వెంటనే రోహిత్ కూడా హాఫ్ సెంచరీ చేసుకోగా.. భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

54 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 144 పరుగులు చేసింది. రోహిత్(67 బ్యాటింగ్), జైస్వాల్(61 బ్యాటింగ్) సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్.. 150 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ దక్కింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతనాజే(47) మినహా అంతా విఫలమయ్యారు.

Story first published: Thursday, July 13, 2023, 21:42 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+