Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: బెడిసి కొట్టిన టీమిండియా ప్రయోగం.. కష్టాల్లో రోహితసేన

 IND vs WI: Rishbah Pant As Opener For Team India Gone For A Blunder Mistake

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపించి మూల్యం చెల్లించుకుంది. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్.. రాహుల్‌ను ఓపెనర్‌గా పంపిస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్‌ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(5) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. కీమర్ రోచ్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మరీ రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. మరో ఎండ్‌లో ఉన్న పంత్ నిదానంగా ఆడాడు. తన శైలికి భిన్నంగా బంతులను డాట్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. మరో వైపు కోహ్లీ సైతం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ నెమ్మదిగా ఆడటంలో అసౌకర్యానికి గురైన రిషభ్ పంత్(34 బంతుల్లో 3 ఫోర్లతో 18).. ఓడిన్ స్మిత్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇక అదే ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 18) కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 43 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(3 బ్యాటింగ్)తో పాటు సూర్యకుమార్ యాదవ్(12 బ్యాటింగ్) ఉన్నారు.

అయితే టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. అనవసర ప్రయోగాల పేరిట బాగా ఆడే టీమ్‌ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేఎల్ రాహుల్‌ను ఓపెనింగ్ పంపించకుండా రిషభ్ పంత్‌తో ఎందుకు ఇన్నింగ్స్ ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ విశ్లేషకులు సైతం ఇదే అత్యంత చెత్త నిర్ణయం అంటూ మండిపడుతున్నారు.

Story first published: Wednesday, February 9, 2022, 15:14 [IST]
Other articles published on Feb 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+